|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:00 PM
విద్యార్థుల్లో పఠనాసక్తి, లోకజ్ఞానం పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసింది. ఉదయం అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలు విద్యార్థులు వార్తలు చదవాలని ఉత్తర్వులు జారీ చేసింది. తరగతుల వారీగా జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలు, సంపాదకీయాలు చదివించనున్నారు. పత్రికల చందా ఖర్చును పాఠశాల విద్యామండలే భరించనుంది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికే ఇదే విధానం అమల్లో ఉంది.
Latest News