|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:22 PM
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ క్రాంతిగౌడ్ తన క్రీడా ప్రతిభతో దేశానికి కీర్తిని తేవడమే కాకుండా తన తండ్రి కోల్పోయిన గౌరవాన్ని కూడా తిరిగి సంపాదించి పెట్టింది. 13 ఏళ్ల క్రితం బర్తరఫ్ అయిన ఆమె తండ్రి మున్నాసింగ్ గౌడ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. క్రాంతి సోదరులు కూలీలుగా, బస్సు కండక్టర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. అలాంటి కష్టకాలంలోనూ క్రాంతి క్రికెట్‌పై మక్కువ తగ్గకుండా కష్టపడి జాతీయ జట్టులో చోటు సంపాదించింది.
Latest News