|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:46 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్‌ను ఎన్నికల సంఘం వినియోగిస్తోందని ఆమె ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. అన్నారు. గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ఐలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.ఎన్నికల సంఘం రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్య వ్యతిరేక, తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈసీ అన్ని విధాలా తప్పులతడకగా నిర్వహిస్తోందని మండిపడ్డారు. వృద్ధులు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్లను మరణించినట్లుగా చూపిస్తోందని ఆరోపించారు.మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది.
Latest News