|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:20 PM
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రిక తనపై ప్రచురించిన ఓ కథనంపై ఆయన గతంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈరోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది పూర్తిగా అవాస్తవమని ఆరోపిస్తూ లోకేశ్ ఈ కేసు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా, నేడు మూడోసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు.
Latest News