|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:35 PM
రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుకి పాలించే అర్హత లేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రకటనతో, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు ఆపేసిన చంద్రబాబు కుట్ర బట్టబయలైందని ఆయన తెలిపారు. అంతకు ముందు కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ద్వారా ఏపీకి దక్కాల్సిన నీటిని తెలంగాణకు అప్పటి సీఎం కేసీఆర్ తరలించుకుపోతున్నా చంద్రబాబు నోరెత్తలేదని గుర్తు చేశారు. అందుకే అప్పటి పరిస్థితి గుర్తించి, నాటి విపక్షనేత శ్రీ వైయస్ జగన్ కర్నూలులో జలదీక్ష చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు.
Latest News