|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 08:28 PM
ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. ఆ మర్నాడే తన మెడలో మంగళసూత్రాన్ని తీసి భర్త మొహాంపై విసిరికొట్టి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. పెళ్లైన 24 గంటల్లోనే ఇలా చేయడానికి కారణం అతడి జాతకం బయటపడటమే. విస్తుగొలిపే ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపుర నగరం గంగనమిద్దెకు చెందిన సందీప్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడు, కందవార కాలనీలో నివసించే ఓ ధనిక కుటుంబానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండురోజుల కిందట ఇంటి నుంచి పారిపోయారు. అదే జిల్లాలోని చింతామణి పట్టణంలోని గంగానమ్మ ఆలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. పెళ్లిచేసుకున్నట్టు తెలిసి షాకయ్యారు. ఈ జంట చిక్కబళ్లాపురకు వస్తుండగా సోమవారం శిడ్లఘట్ట వద్ద అడ్డుకున్నారు. తమతో రావాలని కుమార్తెను కోరగా.. ఆమె సందీప్‌తో ఉంటానని ఖరాఖండిగా చెప్పింది. చివరకు వారిని నేరుగా చిక్కబళ్లాపుర మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడకు వెళ్లిన తర్వాత తాము ఇష్టపడి పెళ్లిచేసుకున్నామని, మమ్మల్ని వదిలిపెట్టాలని సందీప్ జీవించేశాడు. తనది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. కానీ, అప్పటికే అతడి నిజస్వరూపం గురించి యువతి తల్లిదండ్రులు, పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించలేకపోయాడు. చిక్కబళ్లాపుర తాలూకా నాయనహళ్లికి చెందిన ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించి 2024లో పెళ్లి చేసుకున్నాడు. అలాగే, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఓ మహిళను కూడా ఇలాగే మోసం చేసినట్టు తెలిసింది. దీంతో పాటు అతడిపై బెంగళూరు రామమూర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదయ్యింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓ మైనర్ బాలిక మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిగాడి చేతిలో తాను ఏవిధంగా మోసపోయిందీ సాక్ష్యాలతో సహా వివరించింద. అతడి చిట్టా ఒక్కొక్కటిగా బయటపడటంతో నవ వధువు తానూ మోసపోయానని గ్రహించింది. కొద్ది రోజులు ఇతడితో ఉంటే నా జీవితం కూడా వారిలాగే నాశనమయ్యేదని భావించింది. వెంటనే అతడి కట్టిన తాళిని తెంపి ప్రియుడి మొహంపై విసిరికొట్టి, తన తల్లిదండ్రులతో కలసి వెళ్లిపోయారు.
Latest News