|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:45 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విషయంతో తెలిసిందే. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో చేరాడు. ఫిట్‌నెస్ సాధించి త్వరగానే బయటకు వస్తాడనుకున్నా.. గాయం తీవ్రతతో అది జరగలేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఒక మ్యాచ్ సిములేషన్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే తమ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు అనుగుణంగా అయ్యర్ ఎంపిక ఉంటుందని బీసీసీఐ అప్పుడు పేర్కొంది. దాని ప్రకారమే తాజాగా ఈ స్టార్ బ్యాటర్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు.
అతను పూర్తి ఫిట్‌గా ఉండి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు లేఖ రాసినట్లు.. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ గురించి తెలియజేసినట్లు సమాచారం. కాగా, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి శ్రేయాస్ అయ్యర్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో.. ఈ స్టార్ బ్యాటర్ జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో పాల్గొనడానికి అనుమతి పొందినట్లు సమాచారం.
కాగా, శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రుతురాజ్ గైక్వాడ్ పేరును అనుకుంది బీసీసీఐ. అయ్యర్ ఫిట్‌నెస్ సాధించకపోతే రుతురాజ్‌ను ఆడించాలని అనుకున్నారు. అయితే అయ్యర్ జట్టులోకి తిరిగి రావడంతో.. తుది జట్టులో గైక్వాడ్ ఉండే అవకాశం లేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించినప్పటికీ ఆ బ్యాటర్ ఛాన్స్ మిస్ అయ్యాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ 4వ స్థానంలో బరిలోకి దిగేే అవకాశం ఉంది.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో గాయం అయింది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై.. అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరాడు.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ టీమిండియా జట్టు (అంచనా) :
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
బెంచ్ : రిషభ్ పంత్, అర్ష్ దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ
Latest News