|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:50 PM
కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టిన క్రమంలో ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్లను ఆఫర్లతో సర్‌ప్రైజ్ చేస్తోంది. మరోసారి ఉచిత సిమ్ కార్డు, రూపాయికే నెల రోజుల వ్యాలిడిటీ ఆఫర్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా ఉన్న రీఛార్జ్ ప్లాన్ ద్వారానే అదనపు డేటా అందిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 2.5 జీబీ ఇస్తోన్న ప్లాన్ ద్వారానే రోజుకు 3జీబీ డేటా ఇస్తామని వెల్లడించింది. ఈ ఆఫర్ జనవరి 31, 2026 లోపు రీఛార్జ్ చేసుకునే వారికేనని వెల్లడించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ ఇండియా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా రీఛార్జ్ ప్లాన్ అప్ గ్రేడ్ వివరాలను వెల్లడించింది. రూ.225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అప్ గ్రేడ్ చేస్తినట్లు తెలిపింది. ప్రస్తుతం అందిస్తున్న 2.5 జీబీకి బదులుగా రోజుకు 3జీబీ డేటా ఇస్తామని తెలిపింది.'బీఎస్ఎన్ఎల్ అప్‌గ్రేడ్ చేసిన రూ. 225 రీఛార్జ్ ప్లాన్ పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5జీబీ డేటా ఇస్తుండగా ఇకపై రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ జనవరి 31, 2026 వరకే అందుబాటులో ఉంటుంది' అని పేర్కొంది.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా తమ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ రూ. 225 రీఛార్జ్ ప్లాన్ అప్ గ్రేడ్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే జనవరి 31 తర్వాత మళ్లీ పాత ప్లాన్ ప్రకారమే రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. అలాగే రూ. 251 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. దీని ద్వారా 100 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా BiTV వంటివి అందిస్తోంది. అలాగే రూ. 2799కే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. సూపర్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నట్లు తెలిపింది.
Latest News