|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:14 AM
AP: APSRTCలో నేడు (గురువారం) సమ్మె సైరన్ మోగనుంది. నష్టాలు వస్తున్న నేపథ్యంలో తమకు చెల్లించే అద్దెను పెంచాలని ఆర్టీసీలో సేవలందిస్తున్న అద్దె బస్సు యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సుల సేవలను నిలిపివేస్తామని ప్రకటించాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆర్టీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
Latest News