|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:47 AM
తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థపై నారా లోకేశ్ పరువు నష్టం దావా వేశారు. 2017-19 మధ్య మంత్రిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తన కోసం లక్షల్లో ఖర్చు పెట్టారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ సొంత ఖర్చుతోనే విశాఖ వస్తానని, పార్టీ ఆఫీసులోనే బస చేస్తానని తెలిపారు. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, సామాజిక మాధ్యమాల్లోనూ వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.
Latest News