|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:59 AM
అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పెద్దలు రోజుకు 30 గ్రాములు, 15 ఏళ్లలోపు పిల్లలు 20 గ్రాములు, మూడేళ్లలోపు చిన్నారులకు 15 గ్రాముల ఫైబర్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి, పేగుల్లో చికాకు, మలబద్ధకం, పోషకాల గ్రహణలో ఆటంకం, బరువు తగ్గడం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫైబర్ పరిమాణాన్ని క్రమంగా పెంచుకోవాలి, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కృత్రిమ ఫైబర్ పౌడర్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి.
Latest News