|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:46 PM
విశాఖపట్నం నగరం తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. దేశంలో కాలుష్య పరిస్థితి విషమంగా ఉన్న జాబితాలో విశాఖ రెండో స్థానానికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత సూచీలు (AQI) 326 దాటుతున్నాయి. రాత్రి సమయాల్లో ఇది 329కి చేరుకుంటోంది. పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై జరిమానాలు, కాలం చెల్లిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ చర్యలు ఎంత వరకు ప్రభావవంతంగా ఉంటాయో వేచి చూడాలి.
Latest News