|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 03:21 PM
ఇరాన్‌లో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే లీటర్ వంట నూనె ధర 7.9 లక్షల రియాల్స్ నుండి 18 లక్షల రియాల్స్‌కు, ఒక ట్రే గుడ్ల ధర 22 లక్షల రియాల్స్ నుండి 35 లక్షల రియాల్స్‌కు చేరింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ఇరాన్ కరెన్సీ భారీగా పడిపోవడం దీనికి ప్రధాన కారణాలు. ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని మార్చి, ప్రజలకు నేరుగా డబ్బు అందిస్తున్నా, ధరల పెరుగుదలను అదుపు చేయలేకపోతోంది. అమెరికాతో అణు ఒప్పందం రద్దు, ఇజ్రాయెల్‌తో యుద్ధం వంటి పరిణామాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీశాయి.
Latest News