|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:16 PM
ఒక మహిళ దశాబ్దాల కాలం పాటు తన అసలు గుర్తింపును, పౌరసత్వాన్ని అత్యంత చాకచక్యంగా దాచిపెట్టి.. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసిన వైనం ఉత్తర ప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. విచారణలో ఆమె పాకిస్థాన్ పౌరురాలని తేలడంతో.. విద్యాశాఖ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు నిందితురాలిపై ఫోర్జరీ, మోసం కేసుల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహిరా అక్తర్ అలియాస్ ఫర్జానా అనే మహిళ రాంపూర్ జిల్లా కుమారియా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పని చేసేది. అయితే ఆమె పౌరసత్వంపై అనుమానం రావడంతో బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అంతర్గత విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆమె భారతీయ పౌరురాలు కాదని, పాకిస్థాన్ జాతీయత కలిగిన మహిళ అని తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
నిందితురాలి గతాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మహిరా అక్తర్ 1979లో ఒక పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆమె ఆ దేశ పౌరసత్వాన్ని పొందింది. అయితే కొంతకాలం తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పైనే తిరిగి భారత దేశానికి వచ్చింది. 1985 ప్రాంతంలో ఇక్కడి స్థానిక వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే తన పాక్ పౌరసత్వాన్ని రహస్యంగా ఉంచి, నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలను సృష్టించింది. తనను తాను భారతీయ పౌరురాలిగా ప్రాజెక్ట్ చేసుకుంటూ విద్యాశాఖలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది.
7 ఏళ్లుగా ఒంటి కాలిపైనే.. అన్ని అదే పొజిషన్లోనే
తాజాగా మహిరా అక్తర్ బండారం బయటపడటంతో విద్యాశాఖ ఆమెను వెంటనే సస్పెండ్ చేసి, ఆ తర్వాత విధుల్లో నుంచి తొలగించింది. అదనపు ఎస్పీ అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 318(4), 336, 338, 340 కింద చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. "నిందితురాలు నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొంది వ్యవస్థను మోసం చేసింది. దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
Latest News