|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 09:20 PM
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్–ఐడియా వంటి ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు తరచూ కొత్త రీఛార్జ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్న తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ ఆఫర్‌లో భాగంగా రూ.2399, రూ.485, రూ.347, రూ.225 రీఛార్జ్ ప్లాన్లపై రోజుకు అదనంగా 0.5 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. గతంలో ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తే, ఇప్పుడు అదే ధరకు 3.0 జీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది.ఈ అదనపు డేటా ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే వర్తించనుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.
Latest News