|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:17 AM
AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలోని మోరి-5 డ్రిల్లింగ్ సైట్‌లో చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటనలో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం శకలాలను పూర్తిగా తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా బావి పరిసరాలను శీతలీకరిస్తున్నారు. వెల్ క్యాపింగ్ పనులు ప్రారంభించేందుకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు అవసరమైన బ్లోఅవుట్ ప్రివెంటర్‌ను కూడా ఓఎన్జీసీ సిద్ధం చేసింది.
Latest News