|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 03:08 PM
AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆది వారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించింది.
Latest News