ఇరాన్‌ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో.. రాజధానిలోనే ఏకంగా 217 మంది మృతి
 

by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:07 PM

ఇరాన్‌లో రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. 2026 ప్రారంభంలో ఇరాన్ పాలక యంత్రాంగం నిరసనకారులపై జరిపిన కాల్పుల వల్ల భారీ ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా దేశంలోని అన్ని 31 ప్రావిన్సుల్లో నిరసనలు ఉద్ధృతం అయ్యాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనంపై మొదలైన ఈ ఉద్యమం.. ప్రస్తుతం ఇస్లామిక్ పాలనను అంతం చేయాలనే డిమాండ్‌తో ముందుకు వెళ్తోంది. టెహ్రాన్‌లోని ఒక డాక్టర్ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


కేవలం 6 ఆస్పత్రుల్లోనే 217 మంది నిరసనకారులు మరణించినట్లు రికార్డ్ అయినట్లు ఆ డాక్టర్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది తుపాకీ తూటాల గాయాల వల్లే చనిపోయారని పేర్కొన్నారు. ఈ మృతులు మొత్తం కేవలం రాజధాని టెహ్రాన్‌‌లోనే నమోదైనట్లు వెల్లడించారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) వెల్లడించిన సమాచారం ప్రకారం.. కనీసం 63 మరణాలు ధృవీకరించబడ్డాయి. ఇందులో 49 మంది పౌరులు ఉన్నారు. ఇలామ్ ప్రావిన్స్‌లోని మలెక్షాహిలో బసిజ్ బలగాల కాల్పుల్లో కనీసం 5 మంది నిరసనకారులు మరణించారు. చనిపోయిన వారిలో అత్యధిక శాతం యువకులే ఉన్నట్లు డాక్టర్లు ప్రాథమికంగా గుర్తించారు.


గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ.. పిల్లలను నిరసనలకు దూరంగా ఉంచాలని.. బుల్లెట్ తగిలితే ఫిర్యాదు చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు.. భద్రతా బలగాల్లో కూడా చీలికలు కనిపిస్తున్నాయి. కొందరు అధికారులు నిరసనకారులపై కాల్పులు జరపడానికి వెనుకాడుతున్నారని.. ప్రస్తుత పాలన కుప్పకూలుతుందనే భయం వారిలో ఉందని తెలుస్తోంది.


ఆందోళన చేస్తున్న నిరసనకారులను చంపితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తరహాలోనే ఇక్కడ కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ కరెన్సీ పతనం, నీటి కొరత, విద్యుత్ కోతలు అక్కడి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.


Latest News
Trump says Venezuela talks 'working out well' Mon, Jan 12, 2026, 03:05 PM
BSE warns investors about fake deepfake video misusing CEO's identity Mon, Jan 12, 2026, 02:23 PM
Indian households turn investors, bank deposits surge: SBI report Mon, Jan 12, 2026, 01:51 PM
HinduACTion plans Capitol Hill briefing on minorities Mon, Jan 12, 2026, 01:43 PM
Police suspect sexual assault in B'luru techie murder case Mon, Jan 12, 2026, 01:13 PM