50 ఏళ్ళు నిండిన ఆడవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్
 

by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:49 PM

ఓ వయసు వచ్చాక చాలా వరకూ ఒంట్లోని శక్తి తగ్గిపోతుంది. యుక్తవయసులో ఉన్నట్లుగా ఉండలేం. ఊరికే నీరసంగా మారిపోవడం, ఎముకలు ఊరికే విరిగిపోవడం ఇంకా ఎన్నోఎన్నెన్నో సమస్యలొస్తాయి. ఇక మెనోపాజ్ వచ్చిందంటే చాలా చాలా వరకూ శక్తి తగ్గుతుంది. కీళ్ళు, కండరాలు బలహీనంగా మారి మానసిక సమస్యలొస్తాయి. వీటన్నింటిని ఆడవారు తట్టుకోవాలంటే ముందునుంచీ సరైన డైట్ మెంటెయిన్ చేయాలి. అలాంటి ఫుడ్స్ గురించి చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ లోగ ప్రీతిక. ఆమె ప్రకారం, ఆడవారు 50 దాటాక ఏం తింటే మంచిదో తెలుసుకోండి.


50 తర్వాత ఏమేం తినాలి


​ఆడవారిలో 50 సంవత్సరాలు దాటాక హార్మోనల్ చేంజెస్ స్లో అవుతాయి. దీని వల్లే చాలా వరకూ శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, కండరాలు దృఢంగా మారడం, మానసిక సమస్యలొస్తాయి. అలాంటి సమయంలో మంచి ఫుడ్స్ సమస్యల్ని దూరం చేయడానికి హెల్ప్ చేస్తాయి. సరైన డైట్ తీసుకోవడం వల్ల పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ దూరమవ్వడానికి హెల్ప్ అవుతాయి. అలాంటి ఫుడ్స్ ఏంటంటే


డిన్నర్ తర్వాత నువ్వులు తినడం


​నువ్వుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ బి, బి6, బి9లు అంటే ఫోలేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల్ని ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుంచి కాపాడతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. మంచి నిద్ర ఉండేలా చేస్తాయి. వీటిని మనం కాస్తా వేయించి రోజూ డిన్నర్ తర్వాత 1 టీస్పూన్ పరిమాణంలో తీసుకోవడం మంచిది.


అవిసెలతో ఆరోగ్యం


అవిసెల్లో కూడా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, రిచ్ లిగ్నాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాడీలో హాట్ ఫ్లాషెస్‌ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని మనం పౌడర్‌లా చేసి లంచ్ టైమ్‌లో పెరుగులో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారడమే కాకుండా పోషకాలు అందుతాయి.


నానబెట్టిన బాదంపప్పు


బాదంపప్పు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, రోజుకి 5 నానబెట్టిన బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇందులో మెగ్నీషియం, జింక్, పాస్ఫరస్, విటమిన్ బి9లు ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


వీటితో పాటు పాటించాల్సిన జాగ్రత్తలు


ఈ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు ఎక్కువగా నీరు తాగుతుండాలి. కొద్దిపాటి వర్కౌట్ అంటే యోగా, వాకింగ్ వంటివి చేయొచ్చు. దీంతో పాటు పజిల్స్ ఫిల్ చేయడం వంటివి చేస్తే బాడీ, మైండ్ రెండూ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. ఎలాంటి సమస్యలు దరిచేరవు.

Latest News
'MGNREGA Bachao Sangram' reaching 2.5 lakh gram panchayats: Congress Tue, Jan 13, 2026, 04:38 PM
Tatjana Maria tops Venus Williams in Hobart International opener Tue, Jan 13, 2026, 04:31 PM
Citizens, especially youth, should have basic understanding of AI: Ashwini Vaishnaw Tue, Jan 13, 2026, 04:28 PM
Cooperation between Seoul, Tokyo more important than ever, South Korean President tells Japan PM Tue, Jan 13, 2026, 04:28 PM
Petrol pump bomb blast accused among 3 militants arrested in Manipur; arms recovered Tue, Jan 13, 2026, 04:25 PM