|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 02:51 PM
చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పీఎఫ్, ఇన్సూరెన్స్, బ్యాంకు బకాయిలు పొందేందుకు నామినీలు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నామినీ వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు సక్సెషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కోరరాదని ఆదేశించింది. నామినేషన్ ఉద్దేశం కుటుంబానికి త్వరిత ఆర్థిక సహాయం అందించడమేనని పేర్కొంది. అయితే నామినీ పూర్తి యజమాని కాదని, ఇతర చట్టబద్ధమైన వారసులు తమ వాటా కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో క్లెయిమ్స్ వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది.
Latest News