|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:03 PM
తెల్లగా మెరిసిపోయే ఇడ్లీ, సాంబార్, చట్నీతో కలిపి తింటే ఆ మజాయే వేరు. దక్షిణ భారతీయులందరికీ ఇడ్లీ అంటే ఒక ఎమోషన్. అయితే, ఇడ్లీ జన్మస్థలం భారతదేశం కాదని, 7వ-12వ శతాబ్దాల మధ్య ఇండోనేషియాలో దీని మూలాలు ఉన్నాయని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ దీనిని కెడ్లి, కేదారి అని పిలిచేవారు. అరబ్బు వ్యాపారుల ద్వారా కూడా ఇడ్లీ మన దేశానికి వచ్చిందని ఒక వాదన ఉంది. 7వ శతాబ్దపు కన్నడ ఇతిహాసం వడ్డారాధనేలో ఇడ్లీ తయారీ విధానం గురించి వివరించారు. బియ్యం, మినప్పప్పును కలిపి పులియబెట్టి, ఆవిరి మీద ఉడికించే ఆధునిక పద్ధతి మాత్రం భారతదేశంలోనే అభివృద్ధి చెందింది.
Latest News