|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:42 PM
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, రెండో టీ20కి ముందు మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో మైదానంలోకి వస్తుండగా మురళీ కార్తిక్ పలకరించగా, కోపోద్రిక్తుడైన హార్దిక్ వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి మధ్య గొడవకు కారణం తెలియరాలేదు. అయితే, మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే హార్దిక్ అలా స్పందించి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News