|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:06 PM
రాయలసీమలో వేరుశనగ పంటకు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర నమోదైంది. ఆదోని మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ ధర రికార్డు స్థాయిలో 9,652 పలికింది. గత ఏడాది ధర లేక నష్టపోయిన రైతులు ఈసారి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నూనె గింజలకు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. బోరు బావులు, కాలువల కింద సాగు చేసిన వేరుశనగ ఇప్పుడు రైతులకు చేతికి వస్తోంది.
Latest News