మిఠాయిల ప్రేమికుల రక్షణ చిట్కాలు – ఆరోగ్యానికి హానికరం అవ్వకుండానే తింటే ఎలా?
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 11:22 PM

మనలో చాలామంది కేక్స్, స్వీట్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలలో కూడా వీటిని ఇష్టపడని వారు చాలా తక్కువ. కానీ, టేస్టీగా, కలర్‌ఫుల్‌గా, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండేలా కొన్ని షాప్స్‌లో కెమికల్స్ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి కేక్స్, స్వీట్స్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి హానికరం కావడమే కాకుండా, కొన్ని ప్రమాదకర వ్యాధులకూ దారితీస్తుంది.ఆర్టిఫీషియల్ కలర్స్, లిక్విడ్ గ్లూకోజ్, ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలు కొన్ని కేక్స్, స్వీట్స్‌లో ఉండే అవకాశాలు ఎక్కువ. ఆలురా రెడ్, సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి కలర్స్ పిల్లల్లో అలర్జీ సమస్యలను కలిగించవచ్చు. రిఫైన్డ్ షుగర్, మైదా పండితో తయారయ్యే కేక్స్, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతూ టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలలో కొవ్వు పెరుగుతూ హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఎక్కువ చక్కెర వలన చర్మంపై మొటిమలు రావడం, ముడతలు వేగంగా ఏర్పడడం కూడా సాధారణం.పిల్లలకు కేక్స్, స్వీట్స్ బదులు పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం మంచిది. తక్కువ ధరల కేక్స్, స్వీట్స్ కొనుగోలు చేయడం మానుకోండి. పాలీసోర్బేట్ 60 వంటి కేమికల్స్ బాక్టీరియాను హానీ చేసి జీర్ణ సంబంధ సమస్యలకు కారణం అవుతాయి. పొటాషియం సోర్బేట్, సోడియం బెంజిమేట్ వంటి ప్రిజర్వేటివ్స్ డీ.ఎన్.ఏకు ప్రభావం చూపవచ్చు. డాల్డా వాడిన కేక్స్ హార్ట్ అటాక్ రిస్క్ 25% పెంచవచ్చు.బేకింగ్ పౌడర్‌లో ఉండే అల్యూమినియం ఫాస్ఫేట్ మతిమరపు సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని షాప్స్‌లో పంచదారకు బదులు షుగర్ సిరప్స్ ఉపయోగిస్తారు, ఇవి ఫ్యాటీ లివర్ సమస్యలకు కారణం కావచ్చు. ప్యాక్ చేసిన స్వీట్స్‌లో ఎక్కువ కెమికల్స్ ఉంటే వాటిని కొనవద్దు. కేక్స్, స్వీట్స్ ఎక్కువగా తినే అలవాట్లు ఉంటే, నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినేలా అలవాట్లను మార్చడం మంచిది.

Latest News
Dr Rajendra Prasad remembered on his 63rd death anniversary; CM Nitish pays floral tribute Sat, Feb 28, 2026, 03:21 PM
CM Gupta launches HPV vaccination drive; Delhi aims to vaccinate 1.6 lakh girls in three months Sat, Feb 28, 2026, 03:11 PM
AGuH adopts stealth strategy: Expands in North, lies low in J&K Sat, Feb 28, 2026, 02:42 PM
India vs West Indies head-to-head record and last five matches performance Sat, Feb 28, 2026, 02:38 PM
India urges nationals in Israel to stay alert after Israel US strikes on Iran Sat, Feb 28, 2026, 02:31 PM