|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:24 PM
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ కమిటీల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, కార్యకర్తలే పార్టీ బలమని పేర్కొంటూ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని పార్టీ కమిటీల ప్రాధాన్యతను నాయకులు, కార్యకర్తలకు వివరించారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
Latest News