|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:26 PM
నగరిలో చంద్రబాబు షో అట్టర్ ప్లాప్ అయిందని, ఆయన అబద్దాలు వినలేక జనాలు సగం దారిలోనే పారిపోయారని, నాయకులు పట్టుకున్నా ఆగే పరిస్ధితి లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. గతంలో నగరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేని చంద్రబాబు సభకు రాలేక జనం దూరంగా ఉండిపోయారన్నారు. అయినా ఖాళీ కుర్చీలకు చంద్రబాబు కాన్పిడెంట్ గా అబద్దాలు చెప్పారని రోజా అన్నారు. అందుకే డైవర్షన్ రాజకీయంలో భాగంగా జగనన్నపై లేనిపోని అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రాన్ని స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు. కానీ అప్పులాంధ్ర, అరాచక ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అబద్ధాల ఆంధ్రగా మార్చేశారు. ఎక్కడా కానీ స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర చేసే దిశగా పనిచేయలేదు. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి నగరిలో ఏ పనీ చేయలేదు. అందుకే నగరిలో మీటింగ్ కు ఎదురుగా ఉన్న ఆస్పత్రిలో పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీన్ చేశారు. వాస్తవానికి 100 పడకల నగరి ఆస్పత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో పునాది వేసుకుంది, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పించారు. కాబట్టి అక్కడికి వెళ్తే అవమానం తప్పదని అటువైపు వెళ్లకుండా మీటింగ్ లోనే కూర్చున్నారు. చంద్రబాబు సభలో ఖాళీ కుర్చీలు ఉన్నా కాన్పిడెంట్ గా అబద్దాలు చెప్పారు. ఎందుకంటే జాతి మీడియా పచ్చ ఛానళ్లు ఖాళీ కుర్చీలు చూపించకుండా అబద్దాలు చూపిస్తారనే నీచమైన ఆలోచన. సీఎం ఓ నియోజకవర్గానికి వస్తే చెప్పింది చేశారని చెప్పి పూలవర్షం కురిపించాలి, కానీ మీరు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా సమాధానం చెప్పారా? అని ప్రశ్నించారు.
Latest News