తమిళనాడులో హిందీకి ఎప్పటికి స్తానం లేదు
 

by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:49 PM

తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదని డీఎంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 'భాషా అమరవీరుల దినోత్సవం' సందర్భంగా గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని ఆయన స్మరించుకున్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని తమ రాష్ట్రం ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా స్టాలిన్ చెన్నైలోని భాషా అమరవీరులు తలముత్తు, నటరాజన్ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎండీఏ భవనంలో వారి విగ్రహాలను ఆవిష్కరించారు. "తమిళ భాషను ప్రాణంలా ప్రేమించే రాష్ట్రం, హిందీ రుద్దడాన్ని ఐక్యంగా ఎదుర్కొంది. ప్రతిసారీ అదే తీవ్రతతో నిరసన తెలిపింది" అని స్టాలిన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హిందీ వ్యతిరేక ఉద్యమ చరిత్ర, డీఎంకే నేతలు సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి పాత్రను వివరిస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు.

Latest News
Delhi: Woman, three minor children found murdered in Samaypur Badli; husband absconding Wed, Feb 25, 2026, 01:47 PM
Congress seeks over 30 seats in DMK-led alliance ahead of TN Assembly polls Wed, Feb 25, 2026, 12:52 PM
Zverev advances in Acapulco, Ruud bows out Wed, Feb 25, 2026, 12:45 PM
Private university VC in Punjab terminated for 'misbehaving' with Kashmiri students Wed, Feb 25, 2026, 12:42 PM
Bengal 2026 polls: BJP focuses on pocket-specific issues in preparing election manifesto Wed, Feb 25, 2026, 12:39 PM