నాలుగేళ్లలో మూడుసార్లు టైటిల్ గెలిచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 07:47 AM

దక్షిణాఫ్రికా గడ్డపై 'ఆరెంజ్' జెండా మళ్లీ రెపరెపలాడింది. ఎస్ఏ20 లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, మరోసారి ట్రోఫీని ముద్దాడింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచి, తామే 'అన్ బీటబుల్' అని ఈస్టర్న్ కేప్ నిరూపించుకుంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు డెవాల్డ్ బ్రెవిస్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 101 పరుగులతో మెరుపు శతకం బాదాడు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రిటోరియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. కేవలం 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్కే (68 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (63 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. గత ఏడాది (2025) ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్, ఈసారి మాత్రం కసిగా ఆడి ట్రోఫీని చేజిక్కించుకుంది. 

Latest News
V-P Radhakrishnan to visit Tamil Nadu tomorrow Sat, Feb 21, 2026, 06:14 PM
India captain among ICC Player of the Month nominees for January Sat, Feb 21, 2026, 06:09 PM
Building indigenous AI rooted in Indian languages key to national growth: Govt Sat, Feb 21, 2026, 04:18 PM
Oppn leaders hail US Supreme Court ruling on Trump tariffs Sat, Feb 21, 2026, 04:11 PM
Delhi BJP workers protest outside Congress office, demand Rahul's apology Sat, Feb 21, 2026, 04:07 PM