రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు నిలిపివేసి చంద్రబాబు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:56 AM

చంద్రబాబు సీఎంగా ఉండగా.. రాయలసీమకు ప్రతిసారీ అన్యాయమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తన సన్నిహితుడు తెలంగాణ సీఎం రేవంత్ తో చీకటి ఒప్పందంలో భాగంగా 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు నిలిపివేసారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ప్రకటనతో చంద్రబాబు కుట్ర బయటపడగా.. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో బాబు  డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే 190 రోజుల్లో 40 టీఎంసీలు లిఫ్ట్ చేశామంటూ హంద్రీ నీవా పై  సీఎం సహా మంత్రులంతా దుష్ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. కాలువ వెడల్పు పేరుతో దోపిడీ చేసిన రూ. 3 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని నిలదీశారు. ఇది  ముమ్మాటికీ  రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని.. చరిత్ర హీనుడుగా మిగలొద్దని చంద్రబాబును హెచ్చరించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఘనత దివంగత సీఎం వైయస్ఆర్ దేనని..  4 దఫాలు సీఎంగా ఉన్నా చంద్రబాబుకి  సీమ ప్రయోజనాలు పట్టలేదని ఆక్షేపించారు. 

Latest News
Bangladesh observes Language Martyrs' Day; PM Tarique Rahman unveils commemorative stamps Sat, Feb 21, 2026, 02:35 PM
Innovation in Pakistan a display of administrative convenience over structural reforms: Report Sat, Feb 21, 2026, 02:30 PM
Kerala CPI(M) alleges attempt to foment unrest, defends health sector record Sat, Feb 21, 2026, 02:28 PM
Goa has 10.57 lakh voters after revision as EC publishes final electoral roll Sat, Feb 21, 2026, 02:26 PM
Vijay appoints election observers for TVK ahead of Assembly polls Sat, Feb 21, 2026, 02:25 PM