|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:22 PM
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదముద్ర వేయించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రంలోని మంత్రులు, అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకం, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని అన్నారు. ఫిబ్రవరిలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఎంపీలందరూ వర్చువల్‌గా పాల్గొని రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం కోసం నియమించిన ఎంపీలు, ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చంద్రబాబు తెలిపారు.
Latest News