మహిళల్లో మూలవ్యాధి ఉంటే శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఇవే
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:31 PM

పైల్స్ అనేది ఏ వయసు వారికైనా వచ్చే వ్యాధి. మన దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మూలవ్యాధితో బాధపడుతున్నారు. దీనికి పెద్ద కారణం మలబద్ధకం అంటున్నారు నిపుణులు. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది మలబద్ధకంతో బాధపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పైల్స్, ఫిస్టులా అనేవి మలద్వారం దగ్గర అభివృద్ధి చెందే వ్యాధులు. దీని వల్ల మలద్వారం లోపల, వెలుపల మంట వస్తుంది.


మలబద్ధకం ఉంటే పేగు కదలికలు సరిగ్గా ఉండవు. మలవిసర్జన చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. దీంతో, ఈ పరిస్థితి పైల్స్ వ్యాధికి కారణమవుతుంది. పైల్స్ పురుషుల్ని మాత్రమే కాకుండా మహిళలను కూడా ప్రభావితం చేస్తాయి. మలబద్ధకంతో పాటు, ఎక్కువసేపు నిలబడటం, ఊబకాయం, ప్రెగ్నెన్సీ వంటి అనేక ఇతర అంశాలు కూడా పైల్స్‌కు కారణమవుతుంది. మహిళల్లో పైల్స్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో డాక్టర్ అంజనా ధాబి (ప్రోక్టోలాజిస్ట్, సర్జన్) చెప్పారు. ఎలా తగ్గించుకోవాలో కూడా వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


స్త్రీలకు హేమోరాయిడ్స్ ఎందుకు వస్తాయి?


పైల్స్‌ని హేమోరాయిడ్స్ అని కూడా పిలుస్తారు. నిపుణులు మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలి మహిళల్లో మొలల వ్యాధికి దోహదం చేస్తోందన వివరించారు. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, తక్కువ నీరు తాగడం, ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మలబద్ధకం ఇవన్నీ మొలల వ్యాధికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా మొలల వ్యాధి ఉన్న మహిళల్లో మలబద్దకం సర్వసాధారణం. పైల్స్ ఉంటే మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చుద్దాం.


మహిళల్లో కనిపించే లక్షణాలు


పాయువులో దురద, తీవ్రమైన మంట అనేది స్త్రీలలో పైల్స్ యొక్క లక్షణాలు. పాయువులో ఎరుపు కూడా సంభవించవచ్చు.


మలవిసర్జన తర్వాత కూడా మలవిసర్జన జరగనట్లు అనిపించడం. పురుషులు, స్త్రీలలో లక్షణాలు ఒకేలా ఉంటాయి.


మలవిసర్జన సమయంలో మంట


మలద్వారం చుట్టూ నొప్పి. వాపు కూడా పైల్స్ లక్షణాలు


మలద్వారం దగ్గర వాపు, గడ్డలు ఏర్పడటం కూడా పైల్స్ లక్షణాలు


మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి


అధిక రక్తస్రావంతో కూడిన ఒత్తిడి


మలంతో పాటు శ్లేష్మం లాంటి స్రావాలు


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


మహిళలు పైల్స్ సమస్య ఎదుర్కొంటుంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పైల్స్ లక్షణాల్ని నియంత్రిస్తాయి.గర్భిణీ స్త్రీలు తరచుగా మలబద్ధకాన్ని అనుభవిస్తారు.


ఇది పైల్స్‌కు దారితీస్తుంది. మీరు పైల్స్‌తో ఇబ్బంది పడుతుంటే వెచ్చని నీటితో స్నానం చేయండి. పుష్కలంగా నీరు తాగడం, ఆకుపచ్చ కూరగాయలు తినడం ప్రారంభించండి. ఎక్కువ సేపు కూర్చోవడం మానుకోండి. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మలబద్దకం కొనసాగితే, ఉదయం గోరువెచ్చని నీరు తాగడం ప్రారంభించండి.


ఈ చిట్కాలు పనికొస్తాయి


ఆచార్య శ్రీ బాలకృష్ణ ప్రకారం మహిళలు పైల్స్ లక్షణాల్ని నియంత్రించడానికి కొన్ని ఇంటి నివారణలను పాటించవచ్చు. కలబంద జెల్ వాడటం వల్ల పైల్స్ నియంత్రణలో సాయపడుతుంది. కలబంద జెల్ అంతర్గత, బాహ్య పైల్స్ రెండింటికీ చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.


ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు రకాల హేమోరాయిడ్లకు ప్రభావవంతంగా ఉంటుంది. రక్తస్రావం అయ్యే హెమోరాయిడ్లకు, ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగాలి. రక్తస్రావం అయ్యే హెమోరాయిడ్లకు, ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఒక దూదిని నానబెట్టి ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. ఇది మంట, దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


ఈ ఆహారాలకు దూరంగా ఉండండి


స్పైసీ, మసాలా ఆహారాల్ని నివారించండి. ఎందుకంటే ఇవి లక్షణాల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. పైల్స్ రోగులు ఎక్కువగా ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాల్ని నియంత్రించండి. ఇది మలం గట్టిగా అయ్యేలా చేస్తుంది. దీంతో నొప్పి తీవ్రంగా ఉంటుంది.ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండండి. కారంగా ఎక్కువగా ఉన్న ఆహారాల్ని పరిమితం చేయండి.

Latest News
AI won't kill IT services, will create more work: JP Morgan Sat, Feb 14, 2026, 02:52 PM
Telangana civic poll results a mandate for Congress' welfare model: Rahul Gandhi Sat, Feb 14, 2026, 02:51 PM
Gold dips 1.82 pc during week amidst macroeconomic volatility, soft US CPI data Sat, Feb 14, 2026, 02:50 PM
Armed robbers loot cash, jewellery in Bihar's Sitamarhi; hurl bombs to scare locals Sat, Feb 14, 2026, 02:50 PM
NDA govt brought political stability, ended corruption: Amit Shah confident of 60 pc vote share in Puducherry polls Sat, Feb 14, 2026, 02:49 PM