|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:09 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి ఎంపిక కావడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశీయంగా 'శక్తి' మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రకు ఈ గౌరవం దక్కింది. అయితే, ఈ ఎంపికపై కేరళ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ పెద్ద దుమారమే రేపింది.గతేడాది ఒక కార్యక్రమంలో కామకోటి మాట్లాడుతూ.. ఆవు మూత్రానికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని, అది అనేక వ్యాధులను నయం చేయగలదని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు చేస్తూ కేరళ కాంగ్రెస్ "పద్మశ్రీ వచ్చినందుకు అభినందనలు.. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిన మీ పరిశోధనలను దేశం గుర్తించింది" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది.
Latest News