శశిథరూర్ తో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:13 PM

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ప్రధాని మోదీని పదే పదే మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కూడా శశిథరూర్ హాజరు కాలేదు. దీంతో పార్టీలో విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో, ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం కలిగించవచ్చని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. శశిథరూర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు సీనియర్ నేతలు ఆయనను ప్రైవేట్‌గా ఆహ్వానించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది బహిరంగ వేదికపై కాకుండా, పార్టీ అంతర్గతంగా జరగాలని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో శశిథరూర్ తన స్పందన వెల్లడించారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ, "నా సొంత పార్టీ నాయకత్వంతో చర్చించాల్సిన సమస్యలు ఉన్నాయి. బహిరంగ వేదికపై కాదు... నేను పార్లమెంటు కోసం ఢిల్లీకి వెళ్తాను. నా ఆందోళనలను పార్టీ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేయడానికి.. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి.. సరైన సంభాషణ జరపడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను నమ్ముతున్నాను" అన్నారు. "నేను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. మనం ఎక్కువ దూరం వెళ్లకూడదు. నా విషయానికొస్తే.. ఏదైతో తప్పు జరిగిందో.. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తగిన వేదికలో అది పరిష్కరించబడుతుంది" అని స్పష్టం చేశారు.

Latest News
T20 WC: 'Never been that stressed in my life,' says Ngidi after SA vs AFG double-super over thriller Wed, Feb 11, 2026, 04:47 PM
India has over 400 space startups, investment crosses over $500 million: Minister Wed, Feb 11, 2026, 04:44 PM
India and Bahrain discuss strengthening bilateral ties and naval cooperation Wed, Feb 11, 2026, 04:42 PM
BJP claims Mahua Moitra used husband's shell company to carry out 'wilful' tax evasion Wed, Feb 11, 2026, 04:31 PM
Budget is 'Sarva Mangalkari': Anurag Thakur hits out at Rahul Gandhi Wed, Feb 11, 2026, 04:02 PM