ఇంతమంది కూటమి నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోరా?
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:35 PM

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం గక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి.. బ్లాక్‌ మెయిల్‌ చేసి.. విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేమిటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వ విప్‌ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియో మంగళవారం ప్రధాన మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసినా కూటమి పెద్దల నుంచి కనీస స్పందన లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్‌ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్‌.. ఇలా ఎంతో మంది దురాగతాలు బట్టబయలు కావడం కలకలం రేపింది. ఇక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు, మహిళలపై వేధింపులు తరచూ బయట పడుతూనే ఉన్నాయి అని ఆరోపిస్తున్నారు. 

Latest News
US trade deal - a booster shot for India's AI hardware ecosystem Sun, Feb 08, 2026, 05:44 PM
PM Modi departs for India after concluding Malaysia visit Sun, Feb 08, 2026, 05:43 PM
Seychelles President Patrick Herminie arrives in New Delhi Sun, Feb 08, 2026, 05:38 PM
Assam CM targets Gaurav Gogoi over children's British citizenship Sun, Feb 08, 2026, 05:37 PM
T20 WC: Bethell, Brook hit fifty as England post 184/7 against Nepal Sun, Feb 08, 2026, 05:32 PM