జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:41 PM

కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై తీవ్ర లైంగిక ఆరోపణలు రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తనను లైంగికంగా వాడుకుని, పలుమార్లు గర్భస్రావాలు చేయించారని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇవన్నీ అవాస్తవాలని, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు.రైల్వే కోడూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ తనను ఒకటిన్నర సంవత్సరాలుగా లైంగికంగా వాడుకుంటున్నారని, ఐదుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు తనను, తన కుమారుడిని చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Latest News
Death toll in Islamabad suicide bombing climbs to 36 Sat, Feb 07, 2026, 03:14 PM
India has lowest US tariffs among competitors, agri and dairy fully protected: Piyush Goyal Sat, Feb 07, 2026, 03:00 PM
BMTC bus mows down Manipuri woman in Bengaluru, sparks public outrage Sat, Feb 07, 2026, 02:57 PM
Rahul, Priyanka target NDA over Pappu Yadav's arrest, allege systemic collusion in NEET aspirant death case Sat, Feb 07, 2026, 02:55 PM
India safeguards agriculture sector, boosts farmer incomes in US deal: FM Sitharaman Sat, Feb 07, 2026, 02:33 PM