ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణపై అమిత్ షాతో చర్చించిన పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:55 AM

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు, ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సమావేశం జరిగింది.ఉప్పాడ ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారంగా 'సీ ప్రొటెక్షన్ వాల్' (సముద్ర రక్షణ గోడ) నిర్మాణ ప్రతిపాదనపై పవన్ చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని ఆయన అమిత్ షాకు వివరించారు. కాకినాడ జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సమర్పించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం పట్ల పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ. 320-323 కోట్ల అంచనా వ్యయంతో ఈ రక్షణ గోడను నిర్మించనున్నారు.పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే ఉప్పాడ ఉంది. అక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సముద్రపు కోత సమస్యకు కేంద్రం సహకారంతో శాశ్వత పరిష్కారం కనుగొంటానని ఆయన గతంలో హామీ ఇచ్చారు. ఆ దిశగా ఈ భేటీ ముందడుగుగా కనిపిస్తోంది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM