టీమ్ ఇండియా జట్టుపై ధీమాగా ఉన్నానంటున్న సూర్యకుమార్ యాదవ్
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:01 PM

విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధీమాగా ఉన్నాడు. ఈ ఓటమి తమకు ఒక గొప్ప పాఠమని, రాబోయే ప్రపంచకప్‌కు సిద్ధమవ్వడంలో భాగంగానే తాము ఉద్దేశపూర్వకంగానే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. "మేము ఈ రోజు కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పక్కా బౌలర్లతో ఆడాము. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు, ఆరంభంలోనే వికెట్లు పడితే మిగిలిన వారు ఎలా ఆడతారో పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. వరల్డ్ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వడం మా ప్రాధాన్యం" అని పేర్కొన్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM