అజిత్ పవార్‌ విమాన ప్రమాదాన్ని కొన్ని సెకన్ల ముందు కనిపెట్టిన పైలెట్లు
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:08 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తమైంది.విమానం రన్‌వేకు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ భీతిగొల్పే సమయంలో పైలట్ నోటి నుంచి 'ఓ.. షిట్' అనే ఆవేదనతో కూడిన మాటలు వినిపించాయి. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం నేలకూలింది. ఈ మాటలు విమానం అదుపు తప్పిందని పైలట్లు ముందే గుర్తించారని సూచిస్తున్నాయి.ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ వాయిస్ రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులను అంచనా వేస్తున్నారు. సాంకేతిక లోపమా? లేక వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్లు నియంత్రణ కోల్పోయారా? అన్న కోణంలో లోతైన దర్యాప్తు సాగుతోంది.

Latest News
Oracle mulls laying off up to 30,000 employees to fund AI infra Mon, Feb 02, 2026, 11:55 AM
Gold, silver continue to decline as CME margin requirements hike set to take effect Mon, Feb 02, 2026, 11:52 AM
Samsung SDI remains in red in Q4 on sluggish EV market Mon, Feb 02, 2026, 11:47 AM
'Victory is certain': Vijay to cadres as TVK marks 3rd anniversary Mon, Feb 02, 2026, 11:35 AM
US experts back India's growth, urge manufacturing push Mon, Feb 02, 2026, 11:30 AM