|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:16 PM
నారింజ రసం రుచికరంగా ఉండటమే కాకుండా, రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో వాపును, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 12 వారాల పాటు రోజుకు 500 mL నారింజ రసం తాగిన వారిలో సిస్టోలిక్ రక్తపోటు, పల్స్ ప్రెజర్‌లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.నారింజలో తక్కువ విటమిన్ - ఏ, బి, ఎక్కువ విటమిన్ - సి ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్ లభిస్తుంది. నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి. నారింజ పండు వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.
Latest News