|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 11:46 AM
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అహింసా విధానంతో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సాధించారని, సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ నిత్యం పాటించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
జాతిపితకు మంత్రి నారా లోకేశ్ నివాళి
సత్యం, అహింస మార్గాలనే ఆయుధంగా చేసుకుని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను.' అని నారా లోకేశ్ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.