రాజ్ ఘాట్‌లో గాంధీకి నివాళులర్పించిన ప్రధాని
 

by Suryaa Desk | Fri, Jan 30, 2026, 12:08 PM

మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 'జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఇది అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూలస్తంభం కూడా. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్థులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయి' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.గాంధీ వర్థంతి వేళ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరినీ స్మరించుకుంటారు. ఈ ఏడాది మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్ ఘాట్ వద్ద అధికారిక నివాళులు, ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు బాపు సమాధుల వద్ద ఘన నివాళులర్పిస్తున్నారు. మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినది. 'హే రామ్' అంటూ ప్రాణాలు విడిచిన ఆ మహానుభావుడి ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయి. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోంది.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM