|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 02:32 PM
రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని మాస్కోకు రష్యా ఆహ్వానించింది. అబుదాబిలో జరిగిన చర్చలు శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయి. అయితే భూభాగం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదని సమాచారం.ఇక జెలెన్ స్కీ భద్రతపై తాము హామీ ఇస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇదే విషయంపై పుతిన్ సన్నిహితుడు యూరీ ఉషాకోవ్ మాట్లాడుతూ జెలెన్ స్కీను రష్యా ఆహ్వానించిందని.. ఒకవేళ అతడు సమావేశానికి సిద్ధమైతేనే అని స్పష్టం చేశారు.
Latest News