|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:06 PM
తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబునాయుడు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Latest News