|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:45 PM
కర్ణాటకలోని దావణగెరెలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే తన భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో.. మనస్తాపానికి గురైన భర్త, అతనికి పెళ్లి సంబంధం చూసిన బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. సరస్వతి అనే యువతికి హరీశ్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 23న గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సరస్వతి తన ప్రియుడు శివకుమార్‌తో వెళ్లిపోయినట్లు తేలింది.ఈ విషయం తెలుసుకున్న భర్త హరీశ్ (30) తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను డెత్ నోట్‌లో పేర్కొన్నాడు. హరీశ్ మరణవార్తను తట్టుకోలేక, వారికి పెళ్లి సంబంధం కుదిర్చిన రుద్రేశ్ (36) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Latest News