పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం
 

by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:47 PM

సోషల్ మీడియా వినియోగాన్ని పిల్లలకు నియంత్రించే అంశంపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు శుక్రవారం శాసనసభలో ఆయన వెల్లడించారు. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్. సురేశ్ కుమార్ ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేయగా, మంత్రి స్పందించారు.ఈ విషయం చాలా తీవ్రమైనదని, ఇప్పటికే ఫిన్‌లాండ్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ప్రియాంక్ ఖర్గే గుర్తుచేశారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై మేం చర్చిస్తున్నాం. ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది" అని ఆయన తెలిపారు. ఇప్పటికే మెటా సంస్థ సహకారంతో రాష్ట్రంలో 'డిజిటల్ డిటాక్స్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు, లక్ష మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని వివరించారు.

Latest News
Gold, silver continue to decline as CME margin requirements hike set to take effect Mon, Feb 02, 2026, 11:52 AM
Samsung SDI remains in red in Q4 on sluggish EV market Mon, Feb 02, 2026, 11:47 AM
'Victory is certain': Vijay to cadres as TVK marks 3rd anniversary Mon, Feb 02, 2026, 11:35 AM
US experts back India's growth, urge manufacturing push Mon, Feb 02, 2026, 11:30 AM
Pakistan has not targeted BCCI, it has taken the issue to ICC: Rashid Latif Mon, Feb 02, 2026, 11:09 AM