|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:33 PM
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం తిరిగి ఏర్పడిన వెంటనే తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా కల్పిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ కోసం చెమట చిందించిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా చైతన్యవంతులను చేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని, రాబోయే రోజుల్లో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కమిటీల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
Latest News