టీ20 ప్రపంచ కప్ 2026 అధికారిక గీతం విడుదల
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:25 PM

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ కప్ 2026 అధికారిక గీతం విడుదలైంది. "ఫీల్ ద థ్రిల్" పేరుతో వచ్చిన ఈ పాటను ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, నిర్మించి, స్వయంగా ఆలపించారు. జనవరి 30 ఈ పాటను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి మరింత ఉత్సాహాన్ని నింపేలా ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు హీసెన్‌బర్గ్ ఆంగ్లంలో సాహిత్యం అందించగా, రకీబ్ ఆలం హిందీలో రాశారు. టోర్నీకి ఇది "ప్రధాన సంగీత స్పందన" (సోనిక్ హార్ట్‌బీట్)గా నిలుస్తుందని ఐసీసీ అభివర్ణించింది. ప్రస్తుతం ఈ పాట యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి అన్ని ప్రధాన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM