|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:35 PM
2026 టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా చాలా సమయం ఉండగానే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆటగాళ్ల హక్కుల విషయంలో ప్రపంచ క్రికెటర్ల సంఘం (డబ్ల్యూసీఏ) ఐసీసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరల్డ్ కప్‌లో పాల్గొనే ప్లేయర్ల పేరు, ఫొటో, వీడియో వంటి వాణిజ్య హక్కులకు సంబంధించి ఐసీసీ రూపొందించిన కొత్త నిబంధనలపై డబ్ల్యూసీఏ అభ్యంతరం తెలిపింది.గతంలో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా కొత్త నిబంధనలు ఉన్నాయని, దీనివల్ల ఆటగాళ్ల హక్కులకు భంగం కలుగుతోందని డబ్ల్యూసీఏ ఆరోపించింది. ముఖ్యంగా మీడియా కార్యక్రమాలు, డ్రెస్సింగ్ రూమ్ యాక్సెస్, వ్యక్తిగత సమాచార వినియోగం వంటి అంశాల్లో ప్లేయర్లకు నష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న దేశాల ఆటగాళ్లు ఎక్కువగా ప్రభావితమవుతారని, వరల్డ్ కప్ చాలా మందికి జీవనాధారమని డబ్ల్యూసీఏ సీఈవో టామ్ మోఫాట్ అన్నారు.
Latest News