|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:39 PM
తాను రాజకీయాల్లోకి కింగ్‌మేకర్‌గా వ్యవహరించడానికి రాలేదని, రాబోయే ఎన్నికల్లో గెలవడానికే వచ్చానని ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగినప్రముఖ మీడియా సదస్సు సందర్భంగా, ఆ సంస్థతో దాదాపు గంటపాటు మాట్లాడిన విజయ్ తన రాజకీయ ప్రణాళికలు, వ్యూహాలపై స్పష్టతనిచ్చారు."నేను గెలుస్తాను. కింగ్‌మేకర్‌గా ఎందుకు ఉండాలి? నాకు వస్తున్న ప్రజాదరణ మీరు చూడటం లేదా?" అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణం కేవలం ఒక్క ఎన్నికకు పరిమితం కాదని, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత తనకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా సినిమా స్టార్‌గా ఉన్న తాను, రాజకీయ నాయకుడిగా మారడం అంత సులభం కాదని అంగీకరించారు.
Latest News