అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర....రాఖీ సావంత్
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:17 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నాయంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అజిత్ పవార్ మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె సంచలన ఆరోపణలకు తెరతీశారు. అజిత్ పవార్ మరణం ఒక కుట్రగా ఆమె అభివర్ణించారు. అయితే అజిత్ పవార్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన రాఖీ సావంత్ వేసుకున్న డ్రెస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆమె డ్రెస్‌ చాలా అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన రాఖీ సావంత్.. అజిత్ పవార్ మృతి మహారాష్ట్రకు తీరని లోటు అని పేర్కొన్నారు. తాను అజిత్ దాదాకు నివాళులర్పించడానికి వచ్చానని.. ఆయన మరణంతో తనకు చాలా బాధగా ఉందని తెలిపారు. ఎవరు ఏం చెప్పినా.. అజిత్ దాదా మృతి వెనుక రాజకీయాలు లేవని రాఖీ సావంత్ వెల్లడించారు. కానీ ఇది ఒక కుట్రగా ఆమె అభివర్ణించారు. అజిత్ పవార్ మనకు ఇష్టమైన నాయకుడని.. ఇది కుట్ర అవునా కాదా అంటూ ప్రశ్నించారు.


మరోవైపు.. అజిత్ పవార్ సంతాప సభలో మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని.. కానీ ఇలాంటి దురదృష్టకర సమయంలో ఎవరూ రాజకీయాలు చేయకూడదని విజ్ఞప్తి చేశఆరు. గొప్ప నేతకు గౌరవంగా వీడ్కోలు పలికి.. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చే సమయమని పేర్కొన్నారు. జామ్నేర్‌లో నిర్వహించిన అజిత్ పవార్‌ సంతాప సభకు అన్ని పార్టీల నేతలు తరలివచ్చి నివాళులు అర్పించారు.


మరోవైపు.. మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, వైద్య విద్య మంత్రి గిరీష్ మహాజన్.. అజిత్ పవార్ చిత్రపటాన్ని పూలు వేసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అజిత్‌ దాదా సీనియర్ నాయకుడు మాత్రమే కాదని.. ఆయన ఒక ఫ్రెండ్ అని, బలమైన నాయకుడని పేర్కొన్నారు. జనవరి 28వ తేదీన ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా తన చార్టర్డ్ విమానం కూలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు.. ఇద్దరు పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్.. అజిత్ పవార్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి అంతా ఈ ఘటనలో మృతి చెందారు.

Latest News
This budget is not for common people: Oppn Mon, Feb 02, 2026, 12:51 PM
NIA raids multiple places in Kashmir in terror-related case Mon, Feb 02, 2026, 12:46 PM
Afghan police find arms in car, arrest two suspects Mon, Feb 02, 2026, 12:44 PM
On boycotting clash against India, ICC warns Pakistan over selective T20 WC participation Mon, Feb 02, 2026, 12:27 PM
Off-field fallout: Pakistan's ICC match decision puts Colombo tourism at risk Mon, Feb 02, 2026, 12:05 PM